బాలీవుడ్ అయితే ఓకే
ఐటమ్‌సాంగ్స్‌కు బాలీవుడ్‌లో అయితే ఓకేనని దక్షిణాదిలో మాత్రం సింగిల్‌సాంగ్‌కు అంగీకరించనని అం టోంది నటి ప్రియమణి. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకుంది. అయితే ఆ తరువాత ప్రియమణికి మంచి అవకాశాలే రాలేదు. ఇది తన కెప్పటికీ అసంతృప్తిని కలిగించే విషయమేనంటోందీ భామ. తమిళంలో ఈ బ్యూటీ నటించిన చిత్రం విడుదలై మూడేళ్లకు పైనే అయ్యింది. కోలీవుడ్‌లో ఇంత గ్యాప్ రావడానికి కారణమేమిటన్న ప్రశ్నకు మంచి అవకాశాలు రాకపోవడమేనని పేర్కొంది. ఆ మధ్య టాలీవుడ్‌లో బిజీగా నటించిన ప్రియమణికి ఇప్పుడు అక్కడ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కన్నడం, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోందట.
ప్రియమణి తెలుపుతూ మలయాళంలో ట్రూ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం అంది. కన్నడంలో అంబరిషా అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సింగిల్ సాంగ్‌లో నటించారు. ఆ తరువాత అక్కడ అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు వస్తున్నాయని అయితే మంచి పాత్ర అనిపిస్తేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.దక్షిణాదిలోనూ సింగిల్ సాంగ్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం వస్తే షారూక్ , అమీర్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్ చిత్రాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంది. దక్షిణాదిలో సింగిల్ సాంగ్‌కు ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇక్కడ అలా నటిస్తే ఐటమ్ గర్ల్‌గా ముద్ర వేస్తారనే అభిప్రాయాన్ని ప్రియమణి వ్యక్తం చేసింది.