జంజీర్లో పోలీస్ డ్రస్తో ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ | Priyanka chopra wears khaki uniform with Ram charan in Zanjeer song | Sakshi
Sakshi News home page

జంజీర్లో పోలీస్ డ్రస్తో ప్రియాంక చోప్రా, రామ్ చరణ్

Published Tue, Aug 6 2013 1:32 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

జంజీర్లో పోలీస్ డ్రస్తో  ప్రియాంక చోప్రా, రామ్ చరణ్

జంజీర్లో పోలీస్ డ్రస్తో ప్రియాంక చోప్రా, రామ్ చరణ్

ముంబై:  ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లగా నటించిన చిత్రం జంజిర్. ఆ చిత్రంలో ఓ పాటలో ప్రియాంక చోప్రా పోలీస్ దుస్తులు ధరించి ఛార్మింగ్గా ఉందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.  

ఆ పాటలో పోలీసు దుస్తులు ధరించి ఆమె ఒలికించిన ఒంపు వయ్యారాలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేస్తుందని తెలిపింది. అయితే ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాల కంటే ఈ చిత్రంలోని వైవిధ్యమైన పాటతో ప్రియాంక ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం గుర్తుండి పోతారని చెప్పింది.

ఆమె పోలీసు దుస్తులు వేసుకుంటే తాము చూపు మరల్చుకోలేకపోయామని ఆ చిత్ర ప్రొడక్షన్ యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. జంజీర్ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మహీ గిల్, అతుల్ కులకర్ణి, సంజయ్ దత్ తదితరులు  ప్రధాన తారాగణంగా నటించారు. సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఆ చిత్రానికి అపూర్వ లక్కియా దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement