మాజీ సీఎం కొడుకుతో పూరీ సినిమా | Puri introducing former Chief minister Kumar swamy son Nikhil gouda | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కొడుకుతో పూరీ సినిమా

Published Sat, Sep 26 2015 8:23 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మాజీ సీఎం కొడుకుతో పూరీ సినిమా - Sakshi

మాజీ సీఎం కొడుకుతో పూరీ సినిమా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. జెట్ స్పీడ్తో సినిమాను రెడీ చేసే పూరీ ఆ సినిమా పబ్లిసిటీ  విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటాడు. సినిమాకు హైప్ క్రియేట్ చేయటం, హీరోయిజాన్ని కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయటం పూరీకి తెలిసినట్టుగా మరే దర్శకుడికి తెలియదేమో. అందుకే స్టార్ వారసులను ఇంట్రడ్యూస్ చేయడానికి పూరీనే బెస్ట్ ఛాయిస్గా ఫీల్ అవుతారు.

ఇప్పటికే మెగా వారసుడు రామ్ చరణ్తో పాటు, శాండల్వుడ్ స్టార్హీరో రాజ్కుమార్ తనయుడు పునీత్ రాజ్కుమార్ను పరిచయం చేసిన పూరీ.. ఇప్పుడు మరో క్రేజీ హీరోను పరిచయం చేస్తున్నాడు. అయితే ఈసారి ఓ రాజకీయ నాయకుడి కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నాడు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు.

రానా హీరోగా నటించిన లీడర్ సినిమా రీమేక్ తోనే నిఖిల్ గౌడ హీరోగా పరిచయం కావాల్సి ఉన్నా, అప్పట్లో కుదరలేదు. దీంతో మాస్ హీరోగా ఎంట్రీ ఇద్దామని భావిస్తున్ననిఖిల్, పూరీ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వరణ్తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లోఫర్ షూటింగ్లో బిజీగా ఉన్న పూరీ.. ఆ సినిమా పూర్తయిన తర్వాత నిఖిల్ గౌడ లాంచింగ్ సినిమా పని మొదలుపెట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement