
యుద్ధం కంటే 'మాస్' ఏముంటుంది?-రానా
'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇది చరిత్రలో చోటుచేసుకున్న ఓ మిస్టరీ. 1971లో ఇండియా,పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో మునిగిపోయిన 'పీఎన్ఎస్ ఘాజి' నౌకకు సంబంధించిన మిస్టరీనే కథాంశం. ఈ సినిమాలో రానా... నేవల్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
సముద్ర గర్భంలో కొన్ని రోజులపాటు జరిగిన యుద్ధాన్ని తెర మీద చూపించబోతున్నారు. 'ఘాజి' పేరుతో తెలుగు, హిందీలలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ గురువారమే ప్రారంభమయింది. ఇదే విషయాన్ని రానా ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నారు. దీనికి స్పందిస్తూ ఓ అభిమాని 'మాకు మాస్ మూవీ కావాలి, మీ నుంచి మాస్ మూవీ కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేయగా .. 'యుద్ధం కంటే మాస్ ఏముంటుంది?' అంటూ బదులిచ్చారు రానా. ఈ చిత్ర విజయాన్ని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా రానాకు విషెస్ తెలిపారు.
Pushing my experimental envelope towards mainstream cinema yet again!! #GHAZI (Hindi-Telugu bi-lingual) begins filming today!!
— Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016
#GHAZI India's first submarine based war film!! Based on true incidents!! Wish us luck!!
— Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016
@RanaDaggubati Bro we want mass movie..daggubati fans were expecting mass mve from u
— VAMSI VENKY (@venkyfanvamsi) January 7, 2016
Yuddham Kanna Mass evi untundhi :)?? https://t.co/FkDjo4BpSg
— Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016