అందమైన సిత్రాలు! | Raj Tarun ready with Seethamma Andalu Ramayya Sitralu | Sakshi
Sakshi News home page

అందమైన సిత్రాలు!

Published Mon, Nov 30 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

అందమైన సిత్రాలు!

అందమైన సిత్రాలు!

సీతమ్మ చాలా అందంగా ఉంటుంది. రామయ్య కూడా అందగాడే. అతను చేసే సిత్రాలు భలే ముచ్చటగా ఉంటాయి. ఆ సిత్రాలకు సీతమ్మ ఎలా మురిసిపోయింది? రామయ్య చేసే సిత్రాలు ఎలా ఉంటాయి? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం  ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. టైటిల్ రోల్స్‌లో రాజ్ తరుణ్, అర్తన నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు.  శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు సమర్పణలో ఎస్.ై శెలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ సినిమా నిర్మించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన మా చిత్రాన్ని అన్ని వర్గాలవారు చూడొచ్చు’’ అని దర్శకుడు చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. డిసెంబరులో పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖా వాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విశ్వ, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement