
ఎన్టీఆర్, సూర్యలతో రాజమౌళి చిత్రం?
జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కలసి ఒక చిత్రం చేస్తే?ద్విభాషా చిత్రంగా అది భారీ అంచనాలతో కూడిన చిత్రంగా ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కలసి ఒక చిత్రం చేస్తే?ద్విభాషా చిత్రంగా అది భారీ అంచనాలతో కూడిన చిత్రంగా ఉంటుంది.ఇక ఆ చిత్రానికి బ్రహ్మాండ చిత్రాలను చెక్కే రాజమౌళి దర్శకుడైతే ఇక ఆ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయాలకు చిరునామాగా అద్భుత చిత్రాలు ఆనవాలుగా మారిన రాజమౌళి, మాస్‌ను ఇరగ దీసే జూనియర్ ఎన్టీఆర్, వైవిధ్యానికి తపించే సూర్యల కలయికలో అసలు చిత్రాన్ని ఊహించుకోవచ్చా? ఏమో అయితే అలాంటి ప్రచారానికి నెటిజన్లు తెర దీశారు. ఇప్పుడీ వార్త సినీ వర్గాల్లో మిక్కిలి ఆసక్తిని రేకెత్తిస్తుంది. బాహుబలితో బ్రహ్మాండం రుచిని భారతీయ సినిమా చూపించిన రాజమౌళి ఇప్పుడు దానిని మించే అద్భుతాన్ని బాహుబలి-2లో ఆవిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ చిత్రం పూర్తి కాకుండానే ఆయన తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు మొదలవడం గమనార్హం.
అయితే నిప్పులేనిదే పొగ రాదన్న సామెతగా జూనియర్ ఎన్టీఆర్, సూర్యలతో చిత్రం చేయాలనే ఆలోచన రాజమౌళికి వచ్చి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ నటులిద్దరూ ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్వెళ్లూరుతున్నారని చెప్పవచ్చు. బాహుబలి చిత్రం ఆడియో ఆవిష్కరణ వేదికపైనే ఒక్క చాన్స్ అంటూ సూర్య దర్శకుడు రాజమౌళిని కోరడం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆయన దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ వంటి సంచలన విజయాల చిత్రాల్లో నటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం రూపొందినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇదే కనుక తెర రూపం దాల్చితే మరో టాలీవుడ్ స్టార్ హీరోను కోలీవుడ్‌లో త్వరలోనే చూడవచ్చు. ఇప్పటికే తోళా చిత్రంతో నాగార్జున మరోసారి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక మహేష్‌బాబు, అల్లుఅర్జున్‌ల రాక ఖరారైన విషయం తెలిసిందే.