'శమంతకమణి'లో మహేష్ బాబు..! | Rajendra prasad as Mahesh Babu in Shamantakamani | Sakshi
Sakshi News home page

'శమంతకమణి'లో మహేష్ బాబు..!

Published Wed, Jun 14 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

'శమంతకమణి'లో మహేష్ బాబు..!

'శమంతకమణి'లో మహేష్ బాబు..!

టాలీవుడ్ యంగ్ హీరోస్ సుధీర్ బాబు, నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్లు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలే మంచి రోజు ఫేం శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోలకు సమానమైన మరో కీలక పాత్ర ఉందట.. ఆ పాత్ర పేరే మహేష్ బాబు. కీలకమైన క్యారెక్టర్ కోసం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ను తీసుకున్నారు.

తాజాగా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను గురువారం రిలీజ్ చేయనున్నారు. భవ్యక్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న  ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement