
ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరిద్దరూ రాజమౌళి సినిమా పనిమీదే అమెరికా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్, బోయపాటితో చరణ్ చేయాల్సిన సినిమాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాల షూటింగ్‌తో పాటు రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ భాగం పంచుకుంటున్నారు చరణ్, తారక్‌లు.
ప్రస్తుతం రామ్ చరణ్, తారక్ ల అమెరికా ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రంగస్థలం షూటింగ్ ముగించుకున్న చరణ్ ఇంకా అదే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్ అండ్ ఫిట్‌గా రెడీ అయిపోయాడు. ఈ రోజు ఉదయమే చరణ్, తారక్‌లు అమెరికా బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment