
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గత రాత్రి తన ట్విటర్‌లో ఆసక్తికర ఫోటో ఒకదానిని ట్వీట్ చేశాడు. నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్ చరణ్ కూర్చుని ఉన్న స్టిల్ అది. ఎన్టీఆర్ ఫోటో వైపు చూస్తూ ఫోజు ఇచ్చిన చెర్రీ ఫోటోను పోస్ట్ చేసిన తారక్ ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్ ఉంచాడు. వీరిద్దరూ రాజమౌళి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు అనౌన్స్ ముందు నుంచే వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడుతూ వస్తోంది. అప్పటి నుంచి తరచూ పార్టీలు, ఫోటోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక #RRR మొదలయ్యే అవకాశం ఉంది.
Provoked by LEGENDARY thoughts pic.twitter.com/GvUj6XC4Ra
— Jr NTR (@tarak9999) 8 June 2018