రాజమౌళి కథపై క్లారిటీ ఇచ్చిన చరణ్‌ | Ram Charan Clarity On Rajamouli Multi Starrer | Sakshi
Sakshi News home page

May 10 2018 12:48 PM | Updated on Jul 14 2019 4:05 PM

Ram Charan Clarity On Rajamouli Multi Starrer - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వార్తలపై రామ్‌ చరణ్‌ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందటం లేదని తేల్చేశాడు. రాజమౌళి ఇప్పటి వరకు కాన్సెప్ట్‌ మాత్రమే చెప్పారన్న చరణ్‌, త్వరలో పూర్తి స్క్రిప్ట్‌ వినిపించనున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement