రాజమౌళి మల్టీస్టారర్‌పై ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ | Rahamouli Ram Charan Jr Ntr Movie Update | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 11:14 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Rahamouli Ram Charan Jr Ntr Movie Update - Sakshi

బాహుబలి సక్సెస్‌ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఓ భారీ మల్టీస్టారర్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ స్వాతంత్ర్యోధ్యమ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అవుతున్న సెట్స్‌, ప్రాపర్టీస్‌ అన్ని ఆ కాలానికి తగ్గట్టుగా డిజైన్‌ చేస్తున్నారట.డిసెంబర్‌ నుంచి ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొననున్నాడు చరణ్ కాస్త ఆలస్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో జాయిన్‌ కానున్నాడట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement