విక్రమ్ ఆడియో రిలీజ్ గెస్ట్గా చెర్రీ | Ram charan guest for crazy tamil film audio | Sakshi
Sakshi News home page

విక్రమ్ ఆడియో రిలీజ్ గెస్ట్గా చెర్రీ

Jul 24 2016 6:31 AM | Updated on Sep 4 2017 6:04 AM

విక్రమ్ ఆడియో రిలీజ్ గెస్ట్గా చెర్రీ

విక్రమ్ ఆడియో రిలీజ్ గెస్ట్గా చెర్రీ

సీనియర్ హీరోల ఆడియో ఫంక్షన్లకు గెస్ట్లుగా దాదాపు అదే జనరేషన్కు చెందిన సీనియర్ స్టార్లు హజరవుతారు. కానీ విక్రమ్ హీరోగా ఇరు ముగన్ సినిమాను తెరకెక్కిస్తున్న యూనిట్ సభ్యులు మాత్రం...

సీనియర్ హీరోల ఆడియో ఫంక్షన్లకు గెస్ట్లుగా దాదాపు అదే జనరేషన్కు చెందిన సీనియర్ స్టార్లు హజరవుతారు. కానీ విక్రమ్ హీరోగా ఇరు ముగన్ సినిమాను తెరకెక్కిస్తున్న యూనిట్ సభ్యులు మాత్రం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకను దక్షిణాదిలో వివిధ భాషలకు చెందిన యంగ్ హీరోల సమక్షంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

తమిళనాట మంచి హిట్స్తో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తీకేయన్, విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు ముగన్ సినిమా ఆడియో రిలీజ్కు హాజరవుతున్నాడు. మళయాల ఇండస్ట్రీ నుంచి నవీన్ పోలి ఈ వేడుకలో పాల్గొంటుండగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హజరవుతున్నాడు. ఆగస్టు 2న చెన్నైలో ఈ ఆడియో ఫంక్షన్ అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement