
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే సంగతి తెలిసిందే. నూతన నటీనటులను ఎంకరేజ్ చేసే ఆయన.. తాజాగా ఓ యువతికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన ట్విటర్ అకౌంట్‌లో ఆ యువతి టిక్‌టాక్ వీడియోను పోస్ట్ చేసిన వర్మ.. ఆమెకు నటనపై ఆసక్తి ఉంటే harishraju0303@gmail.com కు వివరాలు పంపాల్సిందిగా తెలిపారు. కాగా, @aquagirlak టిక్‌టాక్ ఐడీ పేరిట పోస్ట్ అయిన ఆ వీడియోలో ఓ యువతి.. గతంలో రామ్‌గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన చిన్న బిట్‌ను డబ్ స్మాష్ చేసింది. దీనికి ఫిదా అయిన వర్మ ఆమెకు నటనపై ఆమెకు ఇష్టం ఉంటే వివరాలు పంపాల్సిందిగా కోరాడు.
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రావర్సీలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో తనపై విమర్శలను కూడా ఆయన చాలా లైట్‌గా తీసుకుంటారు.
Hey if u are interested in acting ,can u mail ur details to harishraju0303@gmail.com pic.twitter.com/IIauXVHUPn
— Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2020