రానా
ట్రాఫిక్ గొడవే లేదు. పొల్యూషన్ ప్రాబ్లమ్ లేదు. ప్రశాంతంగా ఉండే ఏరియాకి వెళ్లారు బందేవ్. ఇంతకీ బందేవ్ ఎవరు? అంటే.. మన టాలీవుడ్ హీరో రానానే. గజరాజుతో స్నేహం చేయడానికి బందేవ్ ఎక్కడికి వెళ్లాడో తెలుసా? థాయ్‌లాండ్‌లోని జంగిల్‌లోకి వెళ్లాడు. నెల రోజులు అక్కడే ఉంటారట. ప్రభు సాల్మన్ దర్వకత్వంలో రానా హీరోగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ‘హథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో ‘అడివిరాముడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 1971లో రాజేష్ ఖన్నా హీరోగా వచ్చిన ‘హథీ మేరే సాథీ’ చిత్రానికి ఇది రీమేక్ అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్ అడవిలోకి వెళ్లారట రానా. ‘‘హాథీ మేరే సాథీ’ చిత్రం కోసం థాయ్‌లాండ్స్‌లోని అడవికి వచ్చా. నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాను’’ అని పేర్కొన్నారు రానా. అంటే.. వచ్చే నెల రోజులు జంగిల్ జిందగీ అన్నమాట. అదేనండీ.. అడవి జీవితం అంటున్నాం. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment