రానా
అంటే ఏనుగు దగ్గర అని అర్థం. అవును... రానా దాదాపు 20 రోజుల పాటు ఏనుగులకు దగ్గరగా ఉండబోతున్నారు. వాటితో ఫ్రెండ్‌షిప్ చేయనున్నారు. ఇదంతా ఎందుకు? అంటే.. తెలుగు, తమిళ. హిందీ భాషల్లో రూపొందనున్న ‘హాథీ మేరే సాథీ’ చిత్రం కోసం. ఇంకా తెలుగు, తమిళ వెర్షన్స్‌కి టైటిల్ కన్ఫార్మ్ చేయలేదు. తెలుగులో ‘అడవి రాముడు’ అని పెట్టాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్రదర్శకుడు ప్రభు సాల్మన్ అనుకుంటున్నారు. ఏనుగులతో షూటింగ్ చేయాలి కాబట్టి, రానా ఇప్పటినుంచే వాటితో స్నేహం మొదలుపెట్టాలనుకున్నారట. దాదాపు 20 రోజుల పాటు ఎలిఫెంట్స్ యాక్టివిటీస్ తెలుసుకోవాలనుకుంటున్నారని సమాచారం. సినిమా ప్రారంభించేలోపు వాటితో స్నేహం కుదిరితే షూటింగ్ సజావుగా జరుగుతుంది కదా.
Comments
Please login to add a commentAdd a comment