ప్రపంచంలోని ఏ దేశం కూడా మహిళలకు, యువతులకు సురక్షితం కాదనేది సాధారణంగా తెలిసిన విషయమేనని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనేలా.. నైపుణ్యాలు పెంపొందించుకునేలా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాణి ముఖర్జీ తాజాగా నటిస్తున్న చిత్రం మార్దానీ-2. ఇటీవల విడుదలైన సినిమా ఈ ట్రైలర్‌లో యువతులపై జరిగే భయనక లైంగిక దాడులు ఉండటంతో ఈ చిత్రం వివాదస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ-2’ మహిళలకు, యువతులకు అవగాహన కల్పించేలా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కనిపించే సంఘటనలను గుడ్డిగా వ్యతిరేకించకుండా అలాంటి దాడులు నిజంగానే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులుగా తమ కూతురు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు.. అదే క్రమంలో వారికి భద్రత కూడా కల్పించాలని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.
‘ప్రతి ఏటా మహిళలపై 2000లకు పైగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులోనూ ఎక్కువగా 18 ఏళ్ల వయసున్న యువకులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో తమ అధికారిక రికార్డులలో పేర్కొంది. వాటి ఆధారంగానే ‘మర్దానీ-2’ తెరకెక్కించాం. మేము తీసేది భారతీయ సినిమా కాబట్టి భారత్‌లో జరిగే లైంగిక దాడులనే ప్రధానంగా తీసుకుని సినిమా చేశాం’ అని రాణి చెప్పుకొచ్చారు. ‘యువతను ఉద్దేశించి వారికి అవగాహన కల్పించడమే మర్దానీ సారాంశం. ఆపద అనేది ఇంటి తలుపు తట్టి రాదు.. అది మన పక్కనే ఉంటుంది. అయితే అది గ్రహించి అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడమే సినిమా ఉద్దేశం. అయితే ఇది పూర్తిగా నేరాలను అరికట్టకపోవచ్చు కానీ కొంతమేర యువతులను మాత్రం అప్రమత్తం చేయగలదని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు. కాగా 2014లో వచ్చిన ‘మర్దానీ’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణి ముఖర్జీ క్రైం పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
(చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: ఓం బిర్లా)
Comments
Please login to add a commentAdd a comment