‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్’ (మా ఏపీ) లో సభ్యులైన నిరుపేద కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ పేర్లను ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సర్వేలో విధిగా నమోదు చేసుకోవాలి. నమోదు అయిన ‘మా ఏపీ’ సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉంటుంది’’ అని ‘మా ఏపీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా, అధ్యక్షురాలు కవిత అన్నారు. తెనాలిలోని ‘మా ఏపీ’ కార్యాలయంలో వారు మాట్లాడుతూ–‘‘రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనల మేరకు ‘మా–ఏపీ’ 24 విభాగాల యూనియన్ సంబంధిత శాఖ అధికారుల నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా ఏపీ’కి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 400 మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు సభ్యులుగా ఉన్నారు. ప్రేక్షకులే నిర్ణేతలుగా ‘మా–ఏపీ’ సినీ అవార్డుల వేడుకలను జనవరిలో నిర్వహిస్తున్నాం. అన్ని విభాగాల్లోని వారికి అవార్డులు అందిస్తాం. మా ఏపీ సభ్యులకు హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారిని కలిసి మంజూరు చేసేలా కృషి చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment