బాలయ్య వందో సినిమా లిస్ట్లో మరో దర్శకుడు | Rumors on Balakrishna 100th Movie in Krish Direction | Sakshi
Sakshi News home page

బాలయ్య వందో సినిమా లిస్ట్లో మరో దర్శకుడు

Published Tue, Feb 16 2016 5:14 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య వందో సినిమా లిస్ట్లో మరో దర్శకుడు - Sakshi

బాలయ్య వందో సినిమా లిస్ట్లో మరో దర్శకుడు

ఏ నటుడి కెరీర్లో అయినా.. వంద సినిమాలు చేయటం అన్నది అరుదైన రికార్డే. అలాంటి ఘనతకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే 99 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య తన వందో సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో భారీ విజయం సాధించి అభిమానులకు కానుకగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు.

అందుకు తగ్గట్టుగానే సీనియర్ డైరెక్టర్లతో పాటు యువ దర్శకులు కూడా బాలయ్య వందో సినిమా ఛాన్స్ కోసం క్యూ కడుతున్నారు. బాలకృష్ణతో రెండు భారీ సక్సెస్లు సాధించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని భావించినా, తరువాత సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఇద్దరిలో ఎవరు ఒకరు బాలయ్య వందో సినిమాను డైరెక్ట్ చేస్తారని భావించారు.

కానీ అనూహ్యంగా యువ దర్శకుడు అనీల్ రావిపూడి పేరు తెర మీదకు వచ్చింది. పటాస్ లాంటి భారీ హిట్తో దర్శకుడిగా పరిచయం అయిన అనీల్ బాలయ్యతో రామారావుగారు పేరుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా బాలయ్య వందో సినిమానా.. లేక తరువాతి సినిమానా అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగానే మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. గమ్యం, కంచె లాంటి క్రియేటివ్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్ కూడా బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. మరి ఈ నలుగురిలో బాలయ్య వందో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఎవరు సాధిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement