సల్మాన్‌ఖాన్‌కి స్పెషల్ ఫ్రెండట!
సల్మాన్‌ఖాన్‌కి స్పెషల్ ఫ్రెండట!
Published Fri, Jan 3 2014 1:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సనాఖాన్... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కల్యాణ్‌రామ్ కత్తి, మిస్టర్ నూకయ్య, గగనం సినిమాల్లో నటించింది సనా. ఈ ముంబయ్ ముద్దుగుమ్మ నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విజయం సాధించలేదు. పోనీ ఇతర భాషల్లోనైనా విజయాలున్నాయా? అంటే.. అదీ లేదు. విజయాలు లేకపోతేనేం... ఇప్పుడు సనాఖాన్ రేంజ్ సౌత్‌లో ఏ హీరోయిన్‌కీ లేదనే చెప్పాలి. దానికి కారణం.. ‘జైహో’. సనాఖాన్‌లో ఏ ప్రత్యేకత చూశాడో కానీ... ఏకంగా తన సినిమాలో కథానాయికను చేసేశాడు కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ‘జైహో’ సినిమాలో టబు ఓ హీరోయిన్‌గా నటిస్తున్నా,
గ్లామర్ బరువు మోసే బాధ్యత మాత్రం సనాదే. స్టార్ హీరోయిన్లకు కూడా దక్కని అవకాశం సనాకు దక్కడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. సల్మాన్‌ఖాన్ విశాల హృదయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘టాలెంట్ ఉంది’ అనుకుంటే చాలు.. తన పక్కన చోటు ఇచ్చేస్తుంటారాయన. ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్, అసిన్, స్నేహా ఉల్లాల్ ఇలా చెప్పుకుంటూ పోతే... సల్మాన్ పుణ్యమా అని స్టార్‌లైన వారి లిస్ట్ పెద్దదే.
వారిలో ఇప్పుడు సనా కూడా చేరబోతోందన్నమాట. ఇటీవల జరిగిన సల్మాన్ పుట్టినరోజు వేడుకలో హడావిడి అంతా సనాదే. ఆ పార్టీలో సనా సందడి చూసి చెవులు కొరుక్కోవడం అక్కడున్నవారి వంతైంది. ‘సల్మాన్ పార్టీలో నైట్ అవుట్ చేయడం నా అదృష్టం’ అంటూ రెండో రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు సనా. ఈ విషయంపై మీడియా సల్మాన్‌ని వివరణ అడగ్గా.. ‘సనా నా స్పెషల్ ఫ్రెండ్. అందుకే అలా ట్వీట్ చేసుంటుంది’ అంటూ చిరునవ్వులు చిందించారట.
Advertisement
Advertisement