ముంబై : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలి రేప్ వుమెన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్యక్రమంగా పెరుగుతోంది. తాజాగా సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై మరో ఖాన్ స్పందించారు. సల్మాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్న స్టార్ హీరో అమిర్ ఖాన్..ఈ వ్యవహారంలో ఆయనకు సలహా ఇవ్వడానికి మాత్రం నిరాకరించారు. సల్మాన్ వ్యాఖ్యలను ప్రత్యక్షంగా తాను వినలేదనీ..మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. సల్మాన్ అలాంటి కఠిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మీరేమైనా సల్మాన్ కు సలహా ఇస్తారా అని ప్రశ్నించినపుడు సల్మాన్ కు సలహా ఇవ్వడానికి తానెవ్వర్ని అంటూ తప్పించుకున్నారు.
దంగల్ ఫిల్మ్ పోస్టర్ విడుదల సందర్భంగా ఆమిర్ ఖాన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాగా సుల్తాన్ ఫిల్మ్‌లో రెజ్లర్ గా నటిస్తున్న సల్మాన్ తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ షూటింగ్ ముగిసిన తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉందని వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు అలా విభిన్నంగా స్పందించారు. అలా నోరు జారడం మంచిది కాదని ఒకరంటే.. మీడియా అనవసర రాద్దాంతం చేస్తోందని మరికొందరు వ్యాఖ్యానించారు.
దీనిపై జాతీయ మహిళా కమిషన్,ఇతర మహిళా సంఘాలు సీరియస్ గా స్పందించాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన సల్మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే సారీ చెప్పేందుకు సల్మాన్ నిరాకరించి లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
సల్మాన్ వ్యాఖ్యలపై అమీర్ ఏమన్నారంటే..
Published Mon, Jul 4 2016 3:12 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM
Advertisement
Advertisement