కోటి రూపాయల సినిమాను 80 కోట్లతో రీమేక్ | Salman Khan Remaking 1 Cr Film With 80 Cr | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల సినిమాను 80 కోట్లతో రీమేక్

Apr 3 2016 9:59 AM | Updated on Sep 3 2017 9:08 PM

కోటి రూపాయల సినిమాను 80 కోట్లతో రీమేక్

కోటి రూపాయల సినిమాను 80 కోట్లతో రీమేక్

ఇటీవల కాలంలో టాలీవుడ్లో సంఛలన విజయం సాధించిన చిన్న సినిమా క్షణం. అడవి శేష్ హీరోగా తానే కథ అందించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. పీవీపీ సంస్థ కేవలం కోటి రూపాయల...

ఇటీవల కాలంలో టాలీవుడ్లో సంఛలన విజయం సాధించిన చిన్న సినిమా క్షణం. అడవి శేష్ హీరోగా తానే కథ అందించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. పీవీపీ సంస్థ కేవలం కోటి రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించటంతో భారీ లాభాలను సంపాదించి పెట్టింది. ముఖ్యంగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమా కావటంతో రీమేక్ రైట్స్ విషయంలో కూడా భారీ పోటి కనిపించింది.

క్షణం బాలీవుడ్ రీమేక్ రైట్స్ను సాజిద్ నడియావాలా సొంతం చేసుకోగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు. అంతేకాదు తెలుగులో కేవలం కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమాను బాలీవుడ్లో ఏకంగా 80 కోట్ల బడ్జెట్తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్, లక్కీ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీఖితో విలన్ రోల్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇతర పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement