
త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్న హీరో?
ఆనంద్ విహారి ఎవరంటే.. నితిన్. మరి... అనసూయా రామలింగం ఎవరు? స్మైలీ బ్యూటీ సమంతానా? క్యూట్ గాళ్ అనూపమా పరమశ్వరనా? ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పే శారు. అనసూయా రామలింగం ఎవరో కాదు.. ఆమే. ‘‘ఇన్నాళ్లూ అనసూయా రామలింగం పాత్రలో ఒదిగిపోవడం మంచి అనుభూతినిచ్చింది’’ అని సమంత ట్విట్టర్లో పేర్కొ న్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించి దర్శకత్వం వహిస్తున్న ‘అ...ఆ...’ చిత్రంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు.
ఇందులో ‘అ’ అంటే.. అనసూయా రామలింగం... ‘ఆ’ అంటే ఆనంద్ విహారి అని అర్థం. బుధవారం నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే పెళ్ళి కాబోతున్న’’ అంటూ నితిన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ సమంత ట్వీట్ చేశారు. అంటే, నితిన్ త్వరలో పెళ్ళికొడుకు అవుతాడన్న మాట. ఆ మాట అలా ఉంటే, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అ..ఆ’ టాకీ ఇటీవలే పూర్తయింది.
మిగిలిన పాట చిత్రీకరణ త్వరలో పూర్తి కానుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘త్రివిక్రమ్ కలం నుంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ఇది. సమ్మర్‌కి సకుటుంబంగా చూడదగ్గ స్పెషల్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, సమర్పణ: శ్రీమతి మమత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పీడీవీ ప్రసాద్.