సమంత ధరించిన దుస్తులు వేలం పాట!
సమంత ధరించిన దుస్తులు వేలం పాట!
Published Sat, Aug 10 2013 12:09 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
వెండితెరపై రకరకాల కాస్ట్యూమ్స్‌లో అందంగా కనిపించే సమంత విడిగా కూడా మంచి మంచి దుస్తుల్లో దర్శనమిస్తారు. ఆడియో వేడుకల్లో, ఇతర వేడుకల్లో సమంత కాస్ట్యూమ్స్ దాదాపు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతాయి. ఆయా వేడుకల్లో సమంత ధరించిన దుస్తులను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే వేలం పాటలో పాల్గొనొచ్చు. స్వయంగా సమంతే ఈ వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దానికో బలమైన కారణం ఉంది.
ఈ వేలం పాట ద్వారా వచ్చే డబ్బుని ‘ప్రత్యూష ఫౌండేషన్’ అనే సేవా సంస్థకు విరాళంగా ఇవ్వబోతున్నారు సమంత. ఎప్పుడు ఆక్షన్ నిర్వహిస్తారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఈ బ్యూటీ త్వరలో తెలియజేస్తారు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే. ఇంకో విషయం కూడా తెలుసుకుంటే.. సమంతను అభినందనల్లో ముంచెత్తేయడం ఖాయం. అదేంటంటే... కేవలం తన కాస్ట్యూమ్స్‌నే కాకుండా ఇతర స్టార్స్ ధరించిన దుస్తులను కూడా సేకరించాలనుకుంటున్నారామె.
దీని గురించి సమంత చెబుతూ -‘‘నా సహచర తారల దగ్గర వాళ్ల డ్రెస్‌లు అడుగుతాను. అవసరమైతే బతిమాలుకుంటాను. ఒకవేళ ఇవ్వకపోతే దొంగలించేస్తా. ప్రత్యూష ఫౌండేషన్ ఎదుగుదల చూడాలన్నది నా లక్ష్యం. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ల అభివృద్ధి కోసం ఈ సేవా సంస్థ పాటుపడుతోంది. ఇక్కడ సర్వీస్ చేస్తున్నవాళ్లంతా యువతీ యువకులే. వాళ్ల నిజాయతీ నాకు నచ్చింది. ఈ సేవా సంస్థ కోసం కొంతమంది స్పాన్సరర్స్‌తో కూడా మాట్లాడుతున్నా’’ అని చెప్పారు. దీన్నిబట్టి సమంత హృదయం ‘గోల్డ్’ అని అర్థమవుతోంది కదూ.
Advertisement
Advertisement