సెట్‌లో రాజమౌళితో సముద్రఖని | Samujthirakani With Rajamouli On The Sets of Aakashavaani | Sakshi
Sakshi News home page

సెట్‌లో రాజమౌళితో సముద్రఖని

Apr 4 2019 4:36 PM | Updated on Jul 14 2019 4:05 PM

Samujthirakani With Rajamouli On The Sets of Aakashavaani - Sakshi

కోలీవుడ్‌ విలక్షణ నటుడు సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రఘువరన్‌ బీటెక్‌ సినిమాతో హీరోగా తండ్రిగా నటించిన సముద్రఖని, రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా రాజమౌళితో కలిసి సముద్రఖని దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ ఫొటో ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో తీసింది కాదు. రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఆకాశవాణి సినిమాలోనూ సముద్రఖని నటిస్తున్నాడు. రామ్‌చరణ్‌ గాయం కారణంగా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు బ్రేక్‌ పడటంతో రాజమౌళి.. ఆకాశవాణి షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సముద్రఖని, జక్కన్నతో ఫొటో దిగి తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. సముద్రఖని లుక్‌ని బట్టి చూస్తే ఆకాశవాణి కూడా పీరియాడిక్‌ జానర్‌లోనే తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement