అభిమానుల గురించి తారలు అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు గానీ, అభిమానులు మాత్రం తమ అభిమాన తారలపై ఈలినా గిలగిలలాడిపోతారు. వారి అభిమానం అంత ఘాటుగా ఉంటుంది. ఎక్కడిదాకో ఎందుకు పెళ్లి అనేది ఏవరి జీవితంలో అయినా ఒక ప్రధాన భాగం. ముఖ్యంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారంటే వారి అభిమానులు తెగ బాధ పడిపోతుంటారు. అది వారు పెళ్లి చేసుకున్నారని కాదు. ఆ తరవాత వారు ఎక్కడ సినిమాలకు దూరం అవుతారని. అందుకు చిన్న ఉదాహణ తమన్నా.
ఈ మిల్కీబ్యూటీ దక్షిణాది, ఉత్తరాది చిత్రాలతో కథానాయకిగా దుమ్మురేపుతోంది. ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న తమన్నా తాజాగా ఒక మరాఠి చిత్రంలోనూ నటించేస్తోంది. దీనికి ఏబీసీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయం పక్కన పెడితే తమన్నా సడన్‌గా పెళ్లి చేసుకుందనే ప్రచారం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా, కనీసం వదంతులు లాంటివి కూడా ప్రసారం కాలేదు. అలాంటిది పెళ్లేంటని అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఏమిటీ తమన్నా పెళ్లి విషయం మీకూ వింతగా ఉందా.. అసలు విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో నటుడిగా ఎదుగుతున్న సౌందర్‌రాజా ఈయనకు తమన్నా అనే అమ్మాయితో వివాహా నిశ్చితార్థం ఇటీవల జరిగింది. అంతే ఆ తమన్నా తమ అభిమాన నటి అని భావించిన ఆమె అభిమానులు ఇదేంటి ఎవరికీ చెప్పాపెట్టకుండా తమన్నా పెళ్లి చేసుకుంటోంది అని షాక్ అయ్యారు. ఆ తరువాత ఆ తమన్నా వేరు అన్న విషయం తెలియడంతో తమన్నా అభిమానుల మనసు కుదుట పడిందట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment