'నీకు ఆర్బీఐ ఫుల్ ఫామ్ తెలుసా'.. నటిపై మండిపాటు! | Soha Ali Khan tweets on Raghuram Rajan’s exit, trolls ask do you know RBI full form | Sakshi
Sakshi News home page

'నీకు ఆర్బీఐ ఫుల్ ఫామ్ తెలుసా'.. నటిపై మండిపాటు!

Published Mon, Jun 20 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

'నీకు ఆర్బీఐ ఫుల్ ఫామ్ తెలుసా'.. నటిపై మండిపాటు!

'నీకు ఆర్బీఐ ఫుల్ ఫామ్ తెలుసా'.. నటిపై మండిపాటు!

ఆర్బీఐ గవర్నర్ పదవిలో రెండో టర్మ్ కొనసాగబోనని రఘురామ్ రాజన్ స్పష్టంచేయడంతో ఈ విషయమై ఆన్ లైన్ లో పెద్ద చర్చే నడుస్తోంది. రఘురాం రాజన్ నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండో పర్యాయం కూడా ఆయన ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలన్న నెటిజన్లకు తాజాగా బాలీవుడ్ నటి సోహ ఆలి ఖాన్ గొంతు కలిపింది. రాజన్ నిర్ణయం దేశానికి తీవ్ర నష్టమని పేర్కొంది.

'ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ తప్పుకునేలా బలవంత పెట్టారు. ఇది దేశానికి తీవ్ర నష్టం. ఇది సిగ్గుపడాల్సిన విషయం' అంటూ సైఫ్ ఆలిఖాన్ సోదరి అయిన సోహ ట్వీట్ చేసింది. ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. సోహా ఆలిఖాన్ కు ఆర్థిక శాస్త్రంపై అవగాహన ఉందా? కనీసం ఆమెకు ఆర్బీఐ పూర్తి పేరు (ఫుల్ ఫామ్) అయినా తెలుసా? ఎలాంటి పరిజ్ఞానం, సమాచారం లేకుండా రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకునేలా బలవంతపెట్టారని విమర్శించడం ఎంతవరకు సబబు అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ గురించి సోహాకు ఏం తెలుసు అని పలువురు ప్రశ్నించగా.. మరికొందరు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన సోహాకు దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడే అర్హత ఉందని, ఆమె వ్యాఖ్యలను విమర్శించడం సరికాదని ఆమెకు మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement