
ఉయ్యాలవాడపై సుకుమార్ స్పందన
ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా చారిత్రక కథాంశాన్ని ఎంచుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆరుగురు రచయితలతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు దర్శకుడు. మెగాస్టార్ పుట్టిన రోజున సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.
అయితే ఉయ్యాలవాడ సినిమా ఎలా ఉండబోతుందో.. దర్శకుడు సుకుమార్ హింట్ ఇచ్చాడు. రామ్ చరణ్తో కలిసి 'దర్శకుడు' సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న సుకుమార్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రస్థావన తీసుకువచ్చాడు. ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుకుమార్, సురేందర్ రెడ్డి మంచి స్నేహితులు. అందుకే ఒకరి సినిమా కథలు ఒకరికి వినిపించి అభిప్రాయం తెలసుకుంటుంటారు.
అలా సురేందర్ రెడ్డి చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విన్న సుకుమార్, ఆ సినిమా అద్భుతం అంటూ పొగిడేశాడు. సురేందర్ రెడ్డి తొలి సినిమా అతనొక్కడే కథ చెప్పిన సమయంలో కనిపించిన ఎగ్జైట్మెంట్ మళ్లీ ఉయ్యాలవాడ కథ వినిపించిందని చెప్పాడు. ఈ సినిమాలో ప్రతీ సీను సూపర్బ్గా ఉంటుందని, గ్యారెంటీ హిట్ అని చెప్పాడు సుకుమార్.