సుశాంత్‌ సోదరి భావోద్వేగ లేఖ | Sushant Singh Rajput Sister Shares Emotional Letter In Social Media | Sakshi
Sakshi News home page

ఇక బేబీ మాతో భౌతికంగా లేరు: సుశాంత్‌ సోదరి

Jun 18 2020 1:01 PM | Updated on Jun 18 2020 2:04 PM

Sushant Singh Rajput Sister Shares Emotional Letter In Social Media - Sakshi

ముంబై: ‘మా బేబీ, మా బాబు, మా బచ్చా ఇకపై మాతో భౌతికంగా లేరు’ అంటూ బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేత సింగ్‌ కిృతి భావోద్వేగానికి లోనయ్యారు. సుశాంత్‌ ఫొటోతో పాటు అతడు రాసిన ఓ నోట్‌ను గురువారం ఆమె ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ‘సరే.. మాకు తెలుసు మీరు చాలా బాధలో ఉన్నారు.  మీరు ఒక పోరాట యెధుడు. మీరు ధైర్యంగా పోరాడుతున్నారు అనుకున్నాను. కానీ మీరు ఎంత ఒత్తిడికి గురయ్యారో ఎంచుకున్న దారి చెబుతుంది. మీ బాధలను పంచుకుంటూ నా సంతోషాన్ని మీకు ఇవ్వాల్సింది. క్షమించు సోనా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (స్టార్లతోనే పనిచేస్తాం... నీలాంటి వాళ్లతో కాదు..)

అంతేగాక ‘‘మీ మెరిసే కళ్ళు ప్రపంచాన్ని ఎలా కలలుగనాలో నేర్పించాయి. మీ అమాయక చిరునవ్వు మీ స్వచ్ఛమైన మనసుకు అద్దం పడుతుంది. మీరు ఎప్పటికీ నా ప్రియమైన బేబీవి. మీరు ఎక్కడ ఉన్న సంతోషం ఉండాలి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తారని.. ప్రేమిస్తూనే ఉంటారన్న విషయాన్ని తెలుసుకోండి. ఇది పరీక్షించే సమయం అని నాకు తెలుసు. నా ప్రియమైన వారందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు ప్రేమించే అవకాశం వచ్చినప్పుడు ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఎంచుకోండి. కోపం, ఆగ్రహం బదులు దయ, కరుణను ఎన్నుకోండి’’ అంటూ ఆమె రాసుకొచ్చారు. కాగా సుశాంత్‌ ఆదివారం(జూన్‌ 14)న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సుశాంత్‌ తల్లి కూడా ఇటీవల మరణించగా ఆయనకు తండ్రి, ఇద్దరు అక్కాచెల్లెలు ఉన్నారు. (సుశాంత్‌ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement