ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని, రామానాయుణ్ణి ఆదర్శంగా తీసుకుని, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టానని కేజీయస్ అర్జున్ అన్నారు. గత పదేళ్లుగా పలు చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ఆయన ఈ ఏడాది నిర్మాతగా మారుతున్నారు. అంజనీ ప్రొడక్షన్స్ పతాకంపై మూడు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం గోవర్ధన్ దర్శకత్వంలో ‘స్వీట్ మెమరీస్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి, ఒకేసారి విడుదల చేయబోతున్నాం. సునీల్ అనే కొత్త దర్శకుడితో ఓ భారీ చిత్రం నిర్మించనున్నాను. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జగపతిబాబు, జేడీ చక్రవర్తి, అమలాపాల్ నటిస్తారు. ప్రియాంకచోప్రాతో ఓ హిందీ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పారు.
రెండు భాగాలుగా స్వీట్ మెమరీస్
Published Wed, Feb 19 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement