విలన్‌గా చేయాలనుంది | tamanna dream is to act as in villain role | Sakshi
Sakshi News home page

విలన్‌గా చేయాలనుంది

Published Wed, Feb 19 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

విలన్‌గా చేయాలనుంది

విలన్‌గా చేయాలనుంది

 నేను మాత్రం ఎంత కాలం హీరో ముసుగులో జనాల్ని మోసం చేసేది. అందుకే విలన్‌గా అవతారమెత్తాను. మంగాత్తా చిత్రంలో అజిత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు దాని సంగతెందుకంటారా. అజిత్ హీరోగా నటించి బోర్ కొట్టిందని సినిమాలో మాత్రమే అన్నారు. నటి తమన్నా మాత్రం నిజంగానే నాయకిగా నటించి బోర్ కొట్టేసింది. ప్రతి నాయకిగా నటించాలని ఆశగా ఉందంటూ తన మనసులోని భావాన్ని బయట పెట్టింది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ మిల్క్ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు వెనుకంజ వేయడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. చాలా కాలం తరువాత వీరం చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం హిట్ అయినా అమ్మడికి ఇక్కడ తదుపరి అవకాశాలేమీ రావడం లేదు. దీంతో ఏదో ఒక సంచలన స్టేట్‌మెంట్‌తో వార్తలో ఉండాలని భావించిన తమన్న కథానాయకిగా అన్ని రకాల పాత్రలు చేసేశాను ఇక ఇలాంటి పాత్రలు బోర్ కొడుతున్నాయి.
 
  అందుకే ఫర్ ఛేంజ్  కోసం ఒక చిత్రంలో అరుునా విలన్‌గా చేయూలని ఉంది అని వెల్లడించేసింది. మరి మన దర్శక నిర్మాతలు తమన్నా కోరికను ఎలా భావిస్తారో? వేచి చూడాల్సిందే. ఇక్కడ విషయం ఏమిటంటే  ఈ అమ్మడు కోలీవుడ్‌లో ప్రవేశించిన తొలి చిత్రం కేడీ. ఇందులో హీరోయిన్‌గా ఇలియానా నటి స్తే, ప్రతినాయకి చాయలున్న పాత్రను తమన్నా పోషించిందన్న విషయంమర చినట్లుంది. అయినా గతాన్ని మరచిపోవడం మన హీరోయిన్లకు అలవాటయిన పనేగా అంటారా? అయితే ఓ.కే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement