పక్కా కమర్షియల్ వీరుడు | Ajith's Veerudokkade is commercial movie, says B.Jaya | Sakshi
Sakshi News home page

పక్కా కమర్షియల్ వీరుడు

Published Thu, Jan 9 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

పక్కా కమర్షియల్ వీరుడు

పక్కా కమర్షియల్ వీరుడు

 ‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. అజిత్‌కి ఈ సినిమా తెలుగునాట మంచి పేరు తెస్తుంది’’ అని దర్శకురాలు బి.జయ చెప్పారు. అజిత్, తమన్నా జంటగా ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘వీరం’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డా.శ్రీనుబాబు అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో బి.జయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.శ్రీనుబాబు మాట్లాడుతూ -‘‘అజిత్, తమన్నా నటనతో పాటు దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఈ నెల 18న పాటలను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. క్లాస్‌కీ మాస్‌కీ నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయని బి.ఎ.రాజు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement