తమన్నాకు లక్కీ ఛాన్స్? | Tamanna to romance Nagarjuna and Karthi? | Sakshi
Sakshi News home page

తమన్నాకు లక్కీ ఛాన్స్?

Published Tue, Oct 28 2014 11:02 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

తమన్నాకు లక్కీ ఛాన్స్? - Sakshi

తమన్నాకు లక్కీ ఛాన్స్?

తమన్నా... గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారని ఫిలింనగర్ టాక్. నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో పైడిపల్లి వంశీ తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో ఈ మిల్కీ బ్యూటీ కథానాయికగా నటించను న్నారట. తమన్నా జతకట్టేది ఎవరితో అనేది మాత్రం ఇంకా తేలలేదు. నాగ్‌తో తమన్నా ఇప్పటివరకూ నటించలేదు. ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాలతో నాగచైతన్యకు మాత్రం లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారు తమన్నా. తనయుడితో హిట్ పెయిర్ అనిపించుకున్న తమ్ము... తండ్రితో నటించడం గమ్మత్తై విషయమే. ఇక కార్తీ, తమన్నా ఎలాగూ హిట్ కాంబినేషన్.
 
 ఆవారా, చిరుతై చిత్రాలతో వీరిద్దరూ తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పుడు మళ్లీ వీరు జతకడితే... అది ముచ్చటగా మూడోసారి అవుతుంది. తమిళంలో కూడా సినిమాకు క్రేజ్ ఏర్పడడానికే తమన్నాను తీసుకున్నారని ఓ టాక్. ఈ సినిమాపై మరో వార్త కూడా వినబడుతోంది. అదేంటంటే... కథ రీత్యా నాగ్, కార్తీ ఇద్దరూ తమన్నా ప్రేమలో పడతారట. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement