ఆగస్ట్ రెండో వారంలో వల్లవనుక్కుమ్ వల్లవన్ | Vallavanukkum Vallavan teaser to be unveiled on August 2nd | Sakshi
Sakshi News home page

ఆగస్ట్ రెండో వారంలో వల్లవనుక్కుమ్ వల్లవన్

Published Wed, Jul 27 2016 2:43 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

ఆగస్ట్ రెండో వారంలో వల్లవనుక్కుమ్ వల్లవన్ - Sakshi

ఆగస్ట్ రెండో వారంలో వల్లవనుక్కుమ్ వల్లవన్

జిగర్‌తండా చిత్రంలో అసాల్ట్ సేతు పాత్రలో అదరగొట్టి జాతీయ అవార్డును కైవసం చేసుకున్న నటుడు బాబీసింహా. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన కో-2, ఇరైవి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాబీసింహా తాజాగా నిర్మాతగా అవతారమెత్తి, కథానాయకడిగా నటిస్తున్న చిత్రం వల్లవనుక్కుమ్ వల్లవన్. తన అసాల్ట్ ప్రొడక్షన్స్ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నెడుంశాలై చిత్రం ఫేమ్ షివత, పూజా దేవారియా నాయకిలుగా నటిస్తున్నారు.
 
 ముఖ్య పాత్రలో కరుణాకరన్ నటిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయ్ దేసింగు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో బాబీసింహా 11 గెటప్‌లలో కనిపించనున్నారట. అదే విధంగా సుమారు 15 ఏళ్ల తరువాత చెన్నై శివారు ప్రాంతం పులికాట్ లేక్ సమీపంలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం వల్లవనుక్కుమ్ వల్లవన్ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు.ఆ ప్రాంతంలో చివరిగా షూటింగ్ జరుపుకున్నది అజిత్ నటించిన సిటిజన్‌నే నట. ఇలా పలు ప్రత్యేకతలతో కూడిన వల్లవనుక్కుమ్ వల్లవన్  చిత్ర టీజర్‌ను ఆగస్ట్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement