అంతా తూచ్..! : వరుణ్ తేజ్ | Varun Tej on future projects | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 10:58 AM | Last Updated on Sun, Jan 7 2018 12:54 PM

Varun Tej on future projects - Sakshi

ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో రానా హీరోగా తెరకెక్కుతున్న హథీ మేరీ సాథీలోనూ సినిమాలోనూ నటిస్తున్నాడన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై ట్విస్ట్ ఇచ్చాడు వరుణ్. ప్రస్తుతం తొలిప్రేమ సినిమాలో నటిస్తున్న ఈ మెగా హీరో ఇంతవరకు తన తదుపరి చిత్రాలను ఫైనల్ చేయలేదని.. ఏ సినిమాకు కమిట్ అవ్వలేదని తెలిపాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement