
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారాడు. అర్జున్ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తాజాగా మరోసారి బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ గురించి కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఈ విషయంపై స్పందించిన విజయ్ దేవరకొండ ‘త్వరలో జాన్వీ, కరణ్ జోహార్‌లతో సినిమా చేస్తా’ అంటూ అభిమానుల అంచనాలను మరింత పెంచేశాడు. టాక్సీవాలా ప్రమోషన్ సందర్భంగా గతంలో కరణ్ జోహర్ ఆఫీస్‌కు కూడా వెళ్లినట్టుగా చెప్పాడు విజయ్, అంటే ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు మొదలయ్యాయా..? లేక విజయ్ సరదాగా ఇలా కామెంట్ చేశాడా..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.