
అల్లు అర్జున్ (బన్నీ), విజయ్ సేతుపతి
చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో రాజపాండి పాత్రలో నటించి టాలీవుడ్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా... ఇలా కథలో పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవుతుంటారు విజయ్. కానీ ఇటీవల ఆయన ఎంపికలన్నీ విలన్ పాత్రలే అని తెలుస్తోంది. అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం నేడు జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని సంప్రదించారట టీమ్. కథ విని సేతుపతి కూడా సై అన్నారట. మరోవైపు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ విజయ్ సేతుపతిది విలన్ పాత్రే అని కోలీవుడ్ టాక్. ఇలా ఒకవైపు హీరోగా, మరోవైపు మోస్ట్ వాటెండ్ విలన్‌గా మారుతున్నారు విజయ్ సేతుపతి.
Comments
Please login to add a commentAdd a comment