కోపంతో రగిలిపోయిన అనుష్క శర్మ! | Virat Kohli Shares Video Of Angry Wife Anushka Sharma On Twitter! | Sakshi
Sakshi News home page

కోపంతో రగిలిపోయిన అనుష్క శర్మ!

Published Sat, Jun 16 2018 6:27 PM | Last Updated on Sat, Jun 16 2018 6:58 PM

Virat Kohli Shares Video Of Angry Wife Anushka Sharma On Twitter! - Sakshi

ముంబై : విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ.. బెస్ట్‌ సెలబ్రిటీ కపుల్స్‌ వీరు ఒకరు. గతేడాదే వీరిద్దరూ ప్రపంచంలోనే అ‍త్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌ పెళ్లి చేసుకున్నారు. అనుష్క కష్టపడే తత్వం, నిజాయితీ, దేనినైనా నిర్భయంగా చెప్పే గుణం అంటే తనకు ఎంతో ఇష్టమని విరాట్‌ చాలా సార్లే చెప్పారు. ఎ‍ప్పడికప్పుడు అనుష్క శర్మపై తనకున్న ప్రేమను ట్విటర్‌లో చాటిచెబుతూనే ఉన్నారు. తాజాగా తన భార్య కోపంతో రగిలిపోయే ఓ వీడియోను విరాట్‌ కోహ్లి షేర్‌ చేశారు. రోడ్డుపై చెత్తను పడేసిన వ్యక్తిని అనుష్క అక్కడే కడిగిపారేసిన వీడియోను విరాట్‌ కోహ్లి షేర్‌ చేశారు. మొదట కూల్‌గా కారు విండో కిందకి దించి, ఎందుకు చెత్త అలా రోడ్డుపై పాడేసారని లగ్జరీ కారులో వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని అనుష్క ప్రశ్నించారు. రోడ్డుపై చెత్త వేసేటప్పుడు కాస్త ఆలోచించండి. తర్వాత నుంచి చెత్త డబ్బాను వాడండి.. అని సున్నితంగా మందలించారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అనుష్క మాటలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. చేసిన తప్పును ఒప్పుకోకపోయే సరికి, అనుష్క కోపంతో రగిలిపోయారు. 

ఈ సన్నివేశాన్నంతటినీ అనుష్క పక్కనే కూర్చున్న విరాట్‌ వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘చూడండి...ఈ వ్యక్తులు రోడ్డు మీదే చెత్తను విసిరివేశారు. లగ్జరీ కారులో ప్రయాణించే వారికి, మెదడు పోయినట్టుంది. ఇలాంటి వ్యక్తులు మన దేశాన్ని శుభ్రం చేస్తారా? అవును నిజం! ఇలాంటి వాటిని కనుక మీరు చూస్తే, వెంటనే ఇదే విధంగా చేయండి. అవగాహనను కల్పించండి@అనుష్క శర్మ’ అని పేర్కొంటూ విరాట్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చాలా మంది విరాట్‌ కోహ్లికి, ఆయన భార్య అనుష్కకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వీడియోపై కొందరు పరిహాసాలు ఆడుతున్నారు. ఇలా పరిహాసాలు ఆడే సోషల్‌ మీడియా యూజర్లకు కూడా విరాట్‌ కోహ్లి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ‘ఇలా చేయడానికి చాలా మందికి ధైర్యం ఉండదు. అందుకే దీన్ని ఫన్నీగా తీసుకుంటున్నారు. ఇటీవల చాలామందికి మిమి కంటెంట్‌ కావాలి. ఇది చాలా అవమానకరం’ అని మరో ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement