ఆక్రమణల తొలగింపు 'హింసాత్మకం'
ఆక్రమణల తొలగింపు 'హింసాత్మకం'
Published Mon, Sep 19 2016 1:42 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
గువహటి: అసోం కజిరంగా పార్కులో ఆక్రమణల తొలగింపు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా జాతీయ పార్కులో నివాసం ఉంటున్న వారు తమకు పరిహారం చెల్లించేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది.
కజిరంగా పార్కులో ఆక్రమణలను తొలగించాలన్న గవహటి కోర్టు ఆదేశాల అమలులో భాగంగా అధికారలు నగౌన్ జిల్లాలోని బండేర్డుబి ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడానికి ప్రయత్నించారు. అయితే తగినంత పరిహారం చెల్లించేంతవరకు ఖాళీ చేసేది లేదంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో తీవ్ర ఘర్షణ తలెత్తింది. బాష్పవాయువును ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
Advertisement
Advertisement