
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకోపైలెట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీలో భాగంగా విడతల వారీగా నిర్వహిస్తున్న పరీక్షలకు మొదటి రోజు దాదాపు 4 లక్షల మంది హాజరైనట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) గురువారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మూడు షిఫ్ట్‌ల్లో మొత్తం 4.83 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 3.59 లక్షల మంది హాజరయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన పరీక్షల్లో ఇదే రికార్డు స్థాయి హాజరు శాతమని వెల్లడించింది. ఆర్‌ఆర్‌బీ చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌గా భావిస్తున్న ఈ నోటిఫికేషన్‌లో.. మొత్తం 60వేల పోస్టులకుగాను దేశవ్యాప్తంగా 47.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 15 భాషలలో విడతల వారీగా ఈ నెల 31 వరకు జరగనున్న ఈ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.