ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ 55ఏళ్ల మహిళ దారుణహత్యకు గురైంది. ఈ హత్య దోపిడి దొంగలే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ 55ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య దోపిడి దొంగలే చేసిఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్ష రూపాయల విలువైన నగదును దొంగలించబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చోరబడటంతో అడ్డగించిన ఆ మహిళపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయింది. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడిఉండటంతో దోపడి జరిగినట్టు తెలుస్తోందన్నారు. విలువైన వస్తువులు, లక్ష వరకూ భారీ నగదును దొంగలు అపహరించారు.
మృతురాలు కూతురు చెప్పిన వివరాల ప్రకారం.. తన తల్లితో మాట్లాడేందుకు ఫోన్ చేసినా ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో రక్తపు మడుగులో ఉన్న తనతల్లిని చూసి ఆమె దిగ్ర్భాంతికి లోనైంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాళ్లే ఈ హత్యచేసి ఉంటారని మృతురాలి భర్త అనుమానం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.