మీరట్: ఖబరస్తాన్ తోపాటు శ్మశానం కూడా ఉండాలన్న మోదీ వ్యాఖ్యలపై గొడవ సద్దుమణగకముందే బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పాతిపెట్టే శ్మశానాలనే నిర్మించకూడదని, మృతులందర్నీ దహనం చేయాలన్నారు. ‘శ్మశానాలను నిర్మిస్తూపోతే దేశంలో వ్యవసాయానికి స్థలమే ఉండదు.
ఇస్లాం దేశాల్లో శ్మశానాలను నిర్మించే సంప్రదాయం లేదు. అక్కడ భౌతికాయాలను దహనం చేస్తారు’ అని చెప్పారు. అన్ని మతాలవారికి ఉమ్మడి శవదహనశాలలు ఉండేలా చూడాలని మోదీని కోరుతున్నానన్నారు. ‘దేశ జనాభా పెరుగుతోంది. భూమికి కొరత ఉంది. ఉన్న భూమినంతా శ్మశానాల నిర్మాణానికి వాడితే ప్రజలు ఎక్కడ జీవించాలి?’ అని అన్నారు. తాను మోదీకి వ్యతిరేకం కాదని, స్థలం పేరు ఏదైనా, అది దహనం కోసం పనికొచ్చేలా ఉండాలన్నారు.