యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 27న విస్తరించనున్నారు.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గాన్ని ఈనెల 27న విస్తరించనున్నారు. నిజానికి ఎప్పటినుంచో అఖిలేష్ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారని కథనాలు వచ్చినా, గవర్నర్ రామ్ నాయక్ సమయం ఇచ్చిన తర్వాత చివరకు ఈనెల 27ను ముహూర్తంగా నిర్ణయించారు. సమాజ్వాదీ పార్టీ పార్లమెంటరీ బోర్డు 25న సమావేశమై ఎవరెవరిని మంత్రులు చేయాలనే విషయమై ఓ నిర్ణయం తీసుకుంటుంది.
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా ఈ తరుణంలో కేబినెట్ విస్తరణ చేపట్టడం గమనార్హం. నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటికే ఆరుసార్లు మంత్రివర్గాన్ని విస్తరించారు. గత సంవత్సరం అక్టోబర్ 31న ఐదుగురు కేబినెట్ మంత్రులు, 8 మంది సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 8 మంది సహాయ మంత్రులను కొత్తగా తీసుకున్నారు. లక్నో ఎమ్మెల్యేలు శారదా ప్రతాప్ శుక్లా, రవిదాస్ మెహరోత్రాలతో పాటు ముస్లింలను మంచి చేసుకోడానికి ఘజాలా లాహిరికి కూడా పదవి ఇవ్వచ్చని భావిస్తున్నారు.