నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్ ఎత్తివేత!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్ సస్పెన్షన్ను రద్దు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మీడియా ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆమె సస్పెన్షన్పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. నేడో, రేపో దుర్గాశక్తి సస్పెన్షన్పై ఓ నిర్ణయం మాత్రం వెలువడనుందని పేర్కొంది.
దుర్గాశక్తి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ను కలిసినట్లు మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. అఖిలేష్ సింగ్కు దుర్గాశక్తి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో దుర్గాశక్తి సస్పెన్షన్పై అఖిలేష్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ కథనంలో అభిప్రాయపడింది.
గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామంలో మసీద్కు సంబంధించిన గోడ కూల్చివేతకు దుర్గాశక్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడిందని ప్రభుత్వం చెబుతుంది. అయితే రాజకీయ నాయకులకు సంబంధించిన ఇసుక మాఫియాపై దుర్గాశక్తి ఉక్కుపాదంతో అణివేసింది. అందులోభాగంగానే దుర్గాశక్తిపై సస్పెన్షన్ వేటు వేశారని విమర్శకులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.