
ముంబై : గత కొన్ని రోజులుగా కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ మాతృదేశం పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఫొని తుపానుతో నష్టపోయిన ఒడిషాకు భూరీ విరాళం ప్రకటించారు. ఒడిశా సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళమిచ్చారు. పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ తన వంతుగా సాయమందించడంలో ముందుండే అక్షయ్.. ఒడిశాకు విరాళం ప్రకటించిన మొదటి యాక్టర్‌గా నిలవడం విశేషం.
(చదవండి : దేశం మీద ప్రేమను నిరూపించుకోవాలా?)
గతంలో కేరళ, చెన్నై వరదల సమయంలో కూడా ఆయన విరాళం అందించారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారు. భద్రతా బలగాల కుటుంబాలకు సాయం చేసేందుకు ‘భారత్ కే వీర్’ వెబ్‌సైట్ కూడా నెల కొల్పారు. కొంతకాలం క్రితం నిరుపేద యువతులకు సామూహిక వివాహాలు జరిపించే కార్యక్రమంలో పాల్గొని ఒక్కో జంటకు లక్ష రూపాయల చొప్పున అందజేశారు. అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment