‘పచ్చని కశ్మీరం..పటిష్ట భారత్‌’ | Anand Mahindra Weighed In On Massive Troop Deployment In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

‘పచ్చని కశ్మీరం..పటిష్ట భారత్‌’

Published Mon, Aug 5 2019 11:04 AM | Last Updated on Mon, Aug 5 2019 11:06 AM

Anand Mahindra Weighed In On Massive Troop Deployment In Jammu And Kashmir - Sakshi

కశ్మీర్‌పై ఆనంద్‌ మహాంద్ర ఆసక్తికర ట్వీట్‌

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు సంబంధించి వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఇది కేవలం మరో సోమవారం ఉదయం అనే భావన సరికాదని, కశ్మీర్‌పై దేశం యావత్తూ ఉత్కంఠతో ఎదురుచూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో అందరూ సురక్షితంగా ఉండాలని.. దేశ పటిష్టత, భవిష్యత్‌ను ఇనుమడింపచేసే నిర్ణయం వెలువడాలని మనం ప్రార్ధించాలని మహీంద్ర గ్రూప్‌ అధినేత ట్వీట్‌ చేశారు. మరోవైపు కశ్మీర్‌పై కేంద్ర కేబినెట్‌లో కీలక చర్చలు సాగిన క్రమంలో పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయనున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement