చైనీస్‌ ఎంబసీ వెలుపల నిరసన | Army Veterans Protest Outside The Chinese Embassy In Delhi | Sakshi
Sakshi News home page

చైనీస్‌ ఎంబసీ వెలుపల నిరసన

Published Wed, Jun 17 2020 5:22 PM | Last Updated on Wed, Jun 17 2020 5:37 PM

Army Veterans Protest Outside The Chinese Embassy In Delhi - Sakshi

న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో చైనా దొంగదెబ్బ తీసి.. 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలిగొనడంపై దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా తీరుకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని ఆ దేశ ఎంబసీ వెలుపల.. బుధవారం పలువురు మాజీ ఆర్మీ అధికారులు, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జేఎం) సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌జేఎం సభ్యులు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటుగా, ప్లకార్డులను ప్రదర్శించారు. చైనా చర్యలకు ధీటైన జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (చదవండి : విషం చిమ్మిన చైనా..)

ఈ నిరసనల్లో పాల్గొన్న 10 మంది ఎస్‌జేఎం సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాజీ ఆర్మీ అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఓ వైపు సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చిన చైనా.. సోమవారం భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు ఆర్మీ ప్రకటించింది.(చదవండి : వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement