బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలి | BC classify 8 groups | Sakshi
Sakshi News home page

బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలి

Published Thu, Dec 18 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలి

బీసీలను 8 గ్రూపులుగా వర్గీకరించాలి

  • బీసీ కమిషన్ చైర్మన్‌కు జాతీయ నేతల విజ్ఞప్తి
  • ఎనిమిది జాతీయ పార్టీలతో సమావేశం
  • సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని బీసీ కులాలకు సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే జాతీయస్థాయిలో బీసీలను ఎనిమిది గ్రూపులుగా వర్గీకరించాలని, అప్పుడే 27 శాతం రిజర్వేషన్‌లో అందరికీ న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు బుధవారం విజ్ఞప్తిచేశారు.

    బీసీల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జాబితాలో ఉన్న అన్ని కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని వారు విన్నవిం చారు. 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు. ‘కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఏబీసీడీ వర్గాలుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో లేరు. కేంద్రం అమలుచేస్తున్న బీసీ రిజర్వేషన్లకు వర్గీకరణ లేకపోవడం మూలంగా బీసీల్లోని అత్యంత వెనకబడిన కులాలకు, సంచార జాతులకు అన్యాయం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల కులాలను ఎనిమిది గ్రూపులుగా వర్గీకరించాలి’ అని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు. బీసీలను మూడు గ్రూపులుగా వర్గీకరించే ఆలోచన కమిషన్ పరిశీలనలో ఉందని ఈశ్వరయ్య హామీ ఇచ్చినట్టు తెలిపారు.
     
    పార్లమెంటులో బీసీల గొంతు వినిపించండి

    పార్లమెంటులో బీసీల బిల్లు ప్రవేశపెట్టాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, తదితర అంశాలను దేశంలోని 60 కోట్ల మంది బీసీల పక్షాన ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో 20 మంది ప్రతినిధుల బృందం పార్లమెంటులో ఎనిమిది జాతీయ పార్టీల పార్లమెంటరీ నేతలను కలిసి విన్నవించింది.

    లోక్‌సభలో ఏఐడీఎంకే ఫ్లోర్‌లీడర్ డాక్టర్ పి.వేణుగోపాల్, బిజూ జనతాదళ్ పక్ష నేత భర్తృహరి మెహతా, టీడీపీ పక్ష నేత తోట నర్సిం హులు, రాజ్యసభలో టీడీపీ పక్ష నేత టి.దేవేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తదితర నేతలను, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎస్‌ఏడీ నేతలను కలిసి ఈ అంశాలపై చర్చించినట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు.

    వీరంతా బీసీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మెన్ రాజు, బోళ్ల కరుణాకర్, శారద, సి.రాజేందర్, పి.లక్ష్మీనారాయణ, పెరిక సురేష్ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement