
బెంగళూరు : పబ్ రెండో అంతస్తు నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తులను పవన్, వేదగా గుర్తించారు. ఇద్దరు 30 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిద‍్దరు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం పవన్, వేద చర్చ్ స్ట్రీట్‌లో ఉన్న ఓ పబ్‌కు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత ఇద్దరు పబ్ రెండో అంతస్తు నుంచి కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఆత్మహత్యా.. హత్యా ప్రయత్నమా అనే విషయం తెలియాల్సి ఉంది.