3 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జీల నియామకం
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న
మూడు రాష్ట్రాల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ చీఫ్ అమిత్ షా వారి పేర్లను ప్రకటించారు.
సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీని గుజరాత్ బాధ్యతలను, మరో నేత ప్రకాశ్ జవదేకర్ ను కర్ణాటక ఎన్నికల ఇన్ ఛార్జీగా నియమించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ కు మరో కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లట్‌కు అప్పజెప్పింది.
ఇక గుజరాత్, వీరభద్ర పై వ్యతిరేకతతో హిమాచల్ ప్రదేశ్‌లో కాస్త సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, కర‍్ణాటకలో మాత్రం ఓ సర్వే ఫలితాలు బీజేపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అమిత్ షా మూడు రోజుల పర్యటన తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆ సర్వే వెల్లడించింది. అయితే బీజేపీ మాత్రం మూడు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేయాలన్న ధీమాతో ఉంది. మరోపక్క గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో స్థానిక నేతల పనితనం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది.