ఆ 250 స్థానాల్లో మాత్రం ట్యాంపరింగ్!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయంపై ప్రతిపక్షాల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ విజయంపై శుక్రవారం మరోసారి సందేహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉన్న 250 స్థానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మాయావతి ఆరోపించారు. మొత్తం 403 సీట్లకు గాను బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని అంబేడ్కర్ జయంతి సందర్భంగా మాయావతి అన్నారు. కాగా.. ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మాయావతి, కేజ్రీవాల్‌ల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. 'మీరు గెలుపొందినప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయి.. ఓడిపోయినప్పుడు మాత్రం వాటిలో లోపాలున్నాయా' అని ప్రశ్నించారు. లోపం ఈవీఎంలలో కాదు మీలో ఉందని ఆయన చురకలంటించారు.